రాబోయే కాలంలో
ఉత్తర భారతం
మార్వడి,గుప్తాస్
వడ్డి వ్యాపారుల
రాజకీయ ఆధిపత్యాన్ని
వ్యతిరేకిస్తు దక్షిణ భారతం
ఆత్మగౌరవ పతాక
రెపరెపలాడే
రోజులోస్తాయ్..
★★★
పెట్టుబడిదారీ
సమాజంలో
అసమానతలు ఉంటాయి
కాబట్టే వర్గీకరణ ఉద్యమాలు
ఉంటాయి…!
అది కులాల మధ్య కావచ్చు,
ప్రాంతాల మధ్య కావచ్చు,
భాషల మధ్య కావచ్చు,
జాతుల మధ్య కావచ్చు..
★ 72సంవత్సరాల స్వతంత్ర
భారతంలో అత్యంత అవమానకర రీతిలో జీవితాన్ని అనుభవిస్తున్న 40% మంది ప్రజల్లో ముఖ్యంగా మూలవాసులకు
ప్రభుత్వ సంక్షేమ పథకాల
విషయమే తెలియని దుస్థితి ఉన్నప్పుడు సామాజిక అసమానతలు ఎలా సమిసిపోతాయీ…?
అందులోనూ ముఖ్యంగా
దేశ వ్యాప్తంగా19 నుండి 20%
మున్న సంచారజాతులైన
డినోటిపైడ్ ట్రైబ్స్ ప్రజలు
ఓటింగ్ లో పాల్గోగే
విధంగా ఎన్నికల కమిషన్,
రాజకీయ పార్టీలు కృషి చేయలేదంటే దేశాన్ని గతంలో
ఇప్పుడు పాలించిన,పాలిస్తున్న
పాలక వర్గాలు సిగ్గు పడే విషయమే…
★ సమానత్వం దొరకడం లేదని భావించే వ్యక్తులైన
సంస్థలైన అసంతృప్తి వ్యక్తం చేయడంలో తప్పులేదు…
★ ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ వివక్షకు గురవుతున్నామనే
భావనతోనే 60సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు సుదీర్ఘ కాలం పాటు పోరాటం
చేసి ఎన్నో ఆత్మబలిదానాలతో
తెలంగాణ సాధించారు…
తెలంగాణ సాధించాక అభివృద్ధి జరిగిందా అని
ప్రశ్నించేవాళ్ళకు అసలు సమాధానం చెప్పాలసిన
అవసరం లేదు…
★ ఆత్మగౌరవంలేని అభివృద్ధి అనేది సులాభ్ కాంప్లెక్స్ లోని
మరుగుదొడ్లను బంగారంతో
నిర్మించిన చందనంలాంటిదే..
★ 72 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఉత్తరభారతం
నుండి అత్యధిక శాతం మంది ప్రధానులు, ఆర్థిక మంత్రులు,
విద్యా,ఉపాధి,
మానవ వనరులు,రైల్వే,
పరిశ్రమలు,గ్రామీణాభివృద్ధి
తదితర ఉన్నతపదవులు
ఉత్తరభారతం వారి ఆధిపత్యంలో ఉంది ముఖ్యంగా హిందీ ప్రాంతం
ఆధిపత్యం స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది…
కాంగ్రెస్ హాయంలో వందల సంఖ్యలో గుత్త పెట్టుబడిదార్లు
పుట్టుకోస్తే మోదీ హాయంలో
వేల సంఖ్యలో గుత్తపెట్టూబడిదార్లకు
గుప్తాలు నాయకత్వం వహిస్తున్న తీరు చూస్తుంటే
అసమానతలు పెరుగుతున్నాయనడానికి
అద్దం పడుతోంది…
★ ఆర్యుల నీతి సిద్ధాంతాన్ని ద్వంసం చేయకపోవడమే నేటిభారతంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక,సామాజిక అనిశ్చిత పరిస్థితులకు
కారణభూతమైంది…
★ సమాజం చలనశీలి
అది నిరంతరం మార్పుకు
గురవుతూనే ఉంటుంది..
సమాజ పరిణాక్రమంలో
ప్రతి కొత్త మార్పు
పాత దానికంటే అభివృద్ధికరమైనది.
★ కానీ విచిత్ర మేమిటంటే
భారతీయ సమాజాన్న
మళ్ళీ మధ్యయుగాలవైపు వెనక్కి తీసుకువెళ్ళానే
భావవాదులైన మనువాదులు
వింత విన్యాసాలు
చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది…
ఎవరు అంగీకరించినా
అంగీకరించకపోయినా
మార్పు ఆనివార్యత…
అదే చలనశీలత…
★★★
దండి వెంకట్