డిసెంబర్‌ 10న దేశవ్యాప్త ఆందోళనలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎఐఎడబ్ల్యుయు జాతీయ కన్వెన్షన్‌ పిలుపు
* ఏడాది 250 రోజులు పని కల్పించాలి
* రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలి
* ఉపాధి హామీ పనులు కాంట్రాక్టర్లకి అప్పగించొద్దు
* దళిత, గిరిజన వర్గాల ఆర్థిక బలోపేతానికి చర్యలు : బృందా కరత్‌
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌ఈజిఎ) పరిరక్షణకు డిసెంబర్‌ 10న దేశవ్యాప్తంగా ఆందోళనలకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) జాతీయ కన్వెన్షన్‌ పిలుపునిచ్చింది. ఆ రోజున అన్ని రాష్ట్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం నాడిక్కడ కాన్సిస్టిట్యూషన్‌ క్లబ్‌లోని మవులంకార్‌ హాల్‌ ఎఐఎడబ్ల్యుయు నేతృత్వంలో ఉపాధి, ఎంఎన్‌ఆర్‌ఈజిఎపై జాతీయ కన్వెన్షన్‌ జరిగింది. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో ఉపాధిహామీ పథకం అమలు తీరుపై ఆయా రాష్ట్రాల ప్రతినిధులు చర్చించారు. సదస్సుకు అధ్యక్ష వర్గంగా ఎస్‌.తిరునవుక్కరసు, సునీత్‌ చోప్రా, బి.వెంకట్‌, అజిత్‌ పాత్ర వ్యవహరించారు. పది డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.విజయరాఘవన్‌ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ చర్చల్లో మద్దతిచ్చారు. దీంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
తొలుత సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ సదస్సును ప్రారంభిస్తూ ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఏడాదికి 250 రోజులు ఉపాధిహామీ పనులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత తరుణంలో ఈ చర్యలు మాత్రమే దళిత, గిరిజన వర్గాల ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతాయని ఆమె సూచించారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కాంట్రాక్టర్లకు అప్పగిస్తే వారే లబ్ది పొందుతారని, పేద ప్రజానీకానికి ఎటువంటి ఉపాధి ఉండదని పేర్కొన్నారు. ఉపాధి హామీలో పాల్గొనే కూలీలకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ధరలు, ఆర్థిక మాంద్యం దృష్టిలో ఉంచుకొని వేతనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్త్రీ, పురుషులకి ఇచ్చే వేతనాల్లో ఎటువంటి వ్యత్యాసం ఉండరాదని సూచించారు. ఈ పథకాన్నే నమ్ముకొని ఉన్న ప్రజానీకం జీవన ప్రమాణాల్లో కొంతమేర మార్పు వస్తుందన్నారు. పని జరిగిన 15 రోజుల్లోనే వేతనాన్ని కూలీలు పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనికి ప్రతి పౌరుడు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర కార్మిక సంక్షేమ సంస్థ అవకాశం కల్పించాలన్నారు. కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధిహామీ పనులకు యంత్రాలను వినియోగిస్తే, గ్రామీణ ప్రాంత ప్రజలు పూర్తిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అరవై సంవత్సరాలు దాటిని ఉపాధిహామీ కార్మికులకు రూ. 3000 పెన్షన్‌ ఇవ్వాలని అన్నారు. పని కావాలని అడిగిన 15 రోజుల్లో ప్రభుత్వం ఉపాధి హామీ పని కల్పించాలని అన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి తప్పక ఇవ్వాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, మెడికల్‌ కిట్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, మహిళలకు మెటర్నరీ సెలవులు సైతం కల్పించాలని కోరారు. ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ఉపాధిహామీ పని స్థలంలో ఉన్న పరిస్థితులపై చర్చ జరిగే విధంగా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

ప్రమాద బీమా కల్పించాలి: వెంకట రాములు
వ్యవసాయ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వెంకట రాములు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పది మంది కూలీల మృతిపై సంఘం వారం రోజుల పోరాటంతో సిఎం, పిఎం సహాయ నిధి కింద ఒక్కొక్కరికి రూ.13 లక్షలు అందాయని చెప్పారు. ఈ సదస్సులో పాల్గొన్న తపన్‌ సేన్‌ (సిఐటియు), విజూ కృష్ణన్‌ (ఎఐకెఎస్‌), విపి సానూ (ఎస్‌ఎఫ్‌ఐ), ఆశా శర్మ (ఐద్వా) తమ సంఘీభావాన్ని తెలిపారు. సంఘం ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి దడాల సుబ్బారావు, తెలంగాణ అధ్యక్షుడు బి.ప్రసాద్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

90 శాతం పనులు కూలీలకే అప్పగించాలి : వి. వెంకటేశ్వర్లు
ఉపాధిహామీ పథకంలో 90 శాతం పనులు కూలీలు చేతనే చేయించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల నుండి 20 నుంచి 25 లక్షల మంది వ్యవసాయ కార్మికులు కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని, ఆయా ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్త్తోందని తెలిపారు. మనిరేగా పనులు చేస్తున్నప్పుడు మృతి చెందిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామసభలు నిర్వహించని వారిపై చర్యలు తీసుకోవాలని, గ్రామసభలో కూలీలకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. గ్రామ సభల్లోనే పని దినాలను నిర్ణయించాలని సూచించారు.

Courtesy Andhrajyothy…

 

 

 

RELATED ARTICLES

Latest Updates